గురువారం 09 జూలై 2020
Sports - May 04, 2020 , 19:41:42

‘ప్రపంచకప్ నిర్వహణకు ప్రధాన సమస్య అదే’

‘ప్రపంచకప్ నిర్వహణకు ప్రధాన సమస్య అదే’

మెల్​బోర్న్​: ప్రేక్షకులు లేకుండా టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తే ఏమైనా లాభముంటుందా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆస్ట్రేలియా క్రీడాశాఖ మంత్రి రిచర్డ్ కోల్​బెక్​ చెప్పారు. టోర్నీ కోసం ఇతర దేశాల జట్లను ఆస్ట్రేలియాకు తీసుకురాగలమని, అయితే మ్యాచ్​లకు ప్రేక్షకుల హాజరు అంశమే పెద్ద సమస్యగా ఉందని సోమవారం ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. ‘ప్రపంచకప్​తో పాటు ఆస్ట్రేలియా- భారత్ మధ్య టెస్టు సిరీస్​ నిర్వహిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. టోర్నీ కోసం జట్లను తీసుకురావడం పెద్ద విషయం కాదు. ప్రేక్షకుల అంశమే పెద్ద సమస్య. ఆ విషయాన్ని మేం కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. క్రికెట్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ విషయాన్ని ఆలోచిస్తున్నది” అని ఆస్ట్రేలియా మంత్రి కోల్​బెక్ చెప్పాడు. అలాగే కరోనా ప్రభావం ముగిసినా టోర్నీ నిర్వహించాలంటే కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్వారంటైన్​తో పాటు వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుందని ఆస్ట్రేలియా మంత్రి రిచర్డ్ కోల్​బెక్​ చెప్పాడు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఆస్ట్రేలియా సరిహద్దులను సెప్టెంబర్​ 30వ తేదీ వరకు మూసివేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కరోనా తీవ్రత పెరుగుతుండడంతో అక్టోబర్ 18 నుంచి నవంబర్​ 15వ తేదీ వరకు జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై అనుమానాలు పెరుగుతున్నాయి. 


logo