బుడాపెస్ట్: పోర్చుగల్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ వీరుడిగా అవతరించేందుకు అడుగుదూరంలో నిలిచాడు. యూరో ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా గురువారం ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో రెండు గోల్స్ కొట్టాడు. దీంతో క్రిస్టియానో 109 గోల్స్‌ను పూర్తి చేసుకొని.. అత్యధిక అంతర్జాతీయ గోల్స్ జాబితాలో ఇంతకాలం అగ్రస్థానంలో ఉన్న ఇరాన్ దిగ్గజం అలీ దయీని సమం చేశాడు. రొనాల్డో సూపర్ షోతో ఈ మ్యాచ్ 2-2తో సమం కావడంతో పోర్చుగల్ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది.