మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 02, 2020 , 22:57:59

బుగట్టిని సొంతం చేసుకోనున్న రొనాల్డో

 బుగట్టిని సొంతం చేసుకోనున్న రొనాల్డో

ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో.. తనకు తాను గిఫ్ట్ గా ఇచ్చుకునేందుకు చాలా ఖరీదైన లిమిటెడ్ ఎడిషన్ బుగట్టి సెంగోడిసిని కొనుగోలు చేశారు. ఈ కారు విలువ దాదాపు 8.5 మిలియన్ బ్రిటన్ పౌండ్లు. మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 83.34 కోట్లు.

కొరియేర్ డెల్లా సెరా నుంచి అందిన సమాచారం మేరకు, రొనాల్డో తన జట్టును తమ 36 వ సీరీ ఏ విజయానికి సంకేతంగా బుగట్టి సెంటోడిసిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఐదుసార్లు బాలన్ డీ ఓర్ విజేత అయిన రొనాల్డో.. తన గ్యారేజీలో కొత్త హైపర్‌కార్‌ను జోడించి జువెంటస్ తొమ్మిదవ వరుస సీరీ ఏ టైటిల్‌ను వేడుకలను జరుపుకున్నారు.

రియల్ మాడ్రిడ్ స్టార్ చిరోన్, వెయ్రోన్, లా వోయిచర్ నోయిర్‌లను ఇప్పటికే కలిగి ఉన్నందున రొనాల్డోకు బుగట్టిపై ప్రేమ కొత్తేమీ కాదు. ఈ సూపర్ కార్ పది మోడళ్లను మాత్రమే సంస్థ తయారు చేసింది. సూపర్ కార్ 8-లీటర్ డబ్ల్యూ 16 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 1600 హార్స్‌పవర్‌ను కలిగివుంటుంది. బుగట్టి యొక్క తాజా సూపర్ కార్ సెంటోడిసి కేవలం 2.4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. హైపర్‌కార్ 380 కిలోమీటర్ల వేగంతో వస్తుందని కంపెనీ పేర్కొన్నది.

వచ్చే ఏడాది నాటికి స్పెషల్ ఎడిషన్ సెంటోడిసిని దాని యజమానులకు అందజేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన 35 వ పుట్టినరోజు సందర్భంగా పోర్చుగీస్ ఫార్వర్డ్ తన భాగస్వామి జార్జినా రోడ్రిగెజ్ నుంచి బహుమతిగా 6 మిలియన్ల పౌండ్ల ఖరీదైన మెర్సిడెస్ జి వాగన్‌ను అందుకున్నారు.


logo