ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Aug 03, 2020 , 20:00:26

ప్రపంచంలోనే అత్యంత విలువైన కారును కొన్న రొనాల్డో

ప్రపంచంలోనే అత్యంత విలువైన కారును కొన్న రొనాల్డో

పోర్చుగల్ ఫుట్​బాల్ ప్లేయర్​, జువెంటస్​ స్టార్​  క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అత్యంత విలువైన కారును కొనుగోలు చేశాడు. దాదాపు రూ.75కోట్లతో(8.5 మిలియన్ యూరోలు) బుగాటీ లా వెచ్యూర్​​ నొయిర్​ కారును దక్కించుకున్నాడు. దాన్ని తనకే బహుమతిగా ఇచ్చుకున్నాడు. కారుతో తాను దిగిన ఫొటోను రొనాల్డో ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. లా వెచ్యూర్​ నొయిర్​  మోడల్​లో బుగాటీ 10కార్లను మాత్రమే ప్రత్యేకంగా తయారు చేసింది. రొనాల్డో తనకు కావాల్సిన విధంగా ఈ కారును డిజైన్​ చేయించుకున్నాడు. ఈ కారు గంటకు 380 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. అలాగే కేవలం 2.4 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోలగదు. రొనాల్డో గ్యారేజీలో దాదాపు రూ.264కోట్ల విలువైన కార్లు ఉన్నాయి.  కాగా ఈ వారంలో ప్రారంభమయ్యే చాంపియన్స్​ లీగ్​లో జువెంటస్ తరఫున బరిలోకి దిగేందుకు రొనాల్డో సిద్ధమవుతున్నాడు. 


logo