గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 13, 2020 , 00:30:35

‘నిర్బంధం’లో రొనాల్డో

‘నిర్బంధం’లో రొనాల్డో

లిస్బన్‌: ప్రమాదకరమైన కరో నా వైరస్‌ సోకిందేమోననే అనుమానంతో ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోను గదికే పరిమి తం చేసిన సంఘటన వెలుగు చూసిం ది. ఇటలీ డిఫెండర్‌ డానియల్‌ రుగానికి వైర స్‌ పాజిటివ్‌ అని తేలడంతో.. ముం దుజాగ్రత్త చర్యలో భాగంగా రొనాల్డోను అతడి గది నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. ఇటీవల వీరిద్దరూ మైదానంలో కలిసి ఆడారు. దీనిపై పోర్చుగల్‌ అధికారులు స్పందిస్తూ.. ‘కొద్ది రోజుల క్రితమే రొనాల్డో ఇటలీ నుంచి వచ్చాడు. అతడిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. అయినా.. రుగానితో కలిసి ఆడిన ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ప్రస్తుతం రొనాల్డో అతడి కుటుంబసభ్యులు మదీరాలో ఉండనున్నారు’ అని తెలిపారు.


logo