ఆదివారం 29 మార్చి 2020
Sports - Mar 10, 2020 , 19:10:00

అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన క్రికెటర్లు..

అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన క్రికెటర్లు..

హైదరాబాద్‌: భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హోలీ ఉత్సవాల్లో మునిగితేలారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. అందరి జీవితాల్లో మధురమైన రంగులు నిండాలని ట్విట్టర్‌ ద్వారా ఆకాంక్షించాడు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిమానులకు రంగుల పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. పేసర్‌ ఇషాంత్‌ శర్మ.. ప్రజలందరికీ హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలనీ.. శక్తి, ధైర్యం కల్పించాలని కోరుకున్నాడు. 

టీమిండియా ఓపెనర్‌.. శిఖర్‌ ధావన్‌, తన ఫ్యామిలీతో కలిసి హోలీ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. దూస్రా స్పెషలిస్టు, టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌.. భార్య గీతా బస్రాతో, కూతురుతో కలిసి హోలీ జరుపుకున్నాడు. ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు అని తెలిపాడు. యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌.. కుటుంబంతో కలిసి హోలీ సెలెబ్రేట్‌ చేసుకున్నాడు. ప్రజలంతా హోలీ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని క్రికెటర్లు ఆకాంక్షించారు. ఆరోగ్యకరమైన, సహజమైన రంగులతో పండుగను జరుపుకోవాలని వారు ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు సూచించారు.

View this post on Instagram

Happy holi ????????????

A post shared by Deepak Chahar (@deepak_chahar9) on


logo