సోమవారం 08 మార్చి 2021
Sports - Jan 31, 2021 , 17:53:13

'ఆచార్య'గా డేవిడ్ వార్నర్..వీడియో వైరల్‌

'ఆచార్య'గా డేవిడ్ వార్నర్..వీడియో వైరల్‌

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. లాక్‌డౌన్‌లో టిక్‌టాక్‌ వీడియోలు చేసి అలరించిన వార్నర్‌ ఇప్పుడు కూడా క్రికెట్‌ నుంచి విరామం దొరికినప్పుడల్లా కొత్త కొత్త వీడియోలను రిలీజ్‌ చేస్తున్నాడు. 

దక్షిణాది హీరోలు నటించిన సినిమాల్లోని డైలాగ్స్‌తో అలరిస్తూ, పాటలకు స్టెప్పులేసిన వార్నర్‌ ఇప్పుడు మళ్లీ తనదైన స్టైల్‌లో  తెలుగు అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఆచార్య టీజర్‌ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. 

తాజాగా వార్నర్‌ రీఫేస్‌ యాప్‌ను ఉపయోగించి ఆచార్య టీజర్‌లో చిరంజీవి స్థానంలో తన ఫొటోను పెట్టి సరికొత్తగా విడుదల చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

VIDEOS

logo