మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 18, 2020 , 01:06:40

ఇందూరులో క్రికెట్‌ స్టేడియం

ఇందూరులో క్రికెట్‌ స్టేడియం

ఇందూరు: రాష్ట్ర రాజధాని అవతల క్రికెట్‌ అభివృద్ధికి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) సిద్ధమైంది. నిజామాబాద్‌ నగర శివారులోని గూపన్‌పల్లిలో ఆరెకరాల స్థలంలో క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మిస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో హెచ్‌సీఏకు నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మాత్రమే సొంత స్థలాలు ఉన్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అజర్‌ నేతృత్వంలోని హెచ్‌సీఏ కమిటీ స్థలాన్ని పరిశీలించింది. స్టేడియం నిర్మాణానికి కావాల్సిన సదుపాయాలపై చర్చించింది. అనంతరం స్థానిక హోటల్‌లో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో అజర్‌ మాట్లాడారు. ‘గతంలో కమిటీ  మూడు, నాలుగు సార్లు ఈ స్థలాన్ని  పరిశీలించినా..ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ కొత్తగా ఏర్పడిన హెచ్‌సీఏ అపెక్స్‌ కమిటీ దీనికి త్వరితగతిన ఆమోదముద్ర వేసింది. మరో రెండు నెలల్లో స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. వాటికి కావాల్సిన అత్యవసరమైన డ్రెస్సింగ్‌రూమ్స్‌, టాయిలెట్లు, ఫెన్సింగ్‌ పూర్తి చేస్తాం. ఇక్కడి మట్టిని పరిశీలించి గ్రేజింగ్‌ చేసిన తర్వాత మైదానాన్ని తీర్చిదిద్దుతాం. స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నది. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం ప్రోత్సాహమిస్తున్నది. దీంతో ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు’ అని అజర్‌ అన్నాడు. 


logo
>>>>>>