బుధవారం 08 జూలై 2020
Sports - Apr 29, 2020 , 18:51:07

అలా అయితేనే మళ్లీ జాతీయ జట్టుకు ఆడతా: ఏబీ

అలా అయితేనే మళ్లీ జాతీయ జట్టుకు ఆడతా: ఏబీ

ముంబై: ప్రొటీస్ జట్టుకు మళ్లీ కెప్టెన్సీ చేయాలని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్​ఏ) తనను అడిగినట్టు ఏబీ డివిలియర్స్ చెప్పాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ ఆడే సామర్థ్యం తనలో ఉందని అనిపిస్తే మళ్లీ దక్షిణాఫ్రికా జట్టులో పునరాగమనం చేస్తానని అన్నాడు. బుధవారం ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో ఏబీ మాట్లాడాడు. “మళ్లీ దక్షిణాఫ్రికా జట్టుకు ఆడాలంటే నేను అత్యుత్తమ ఫామ్​లో ఉండడం ప్రధానం. మిగిలిన వారికంటే బాగా ఆడాలి. జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు అర్హుడనని నాకు అనిపించాలి. నాతో పాటు ఇతరులు అలాగే అనుకోవాలి” డివిలియర్స్ చెప్పాడు. 2018 మేలో అంతర్జాతీయ క్రికెట్​కు అనూహ్యంగా వీడ్కోలు పలికి డివిలియర్స్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాతి నుంచి ఐపీఎల్​తో పాటు వేరే లీగ్​ల్లో ఆడుతున్న అతడు.. దక్షిణాఫ్రికా జట్టు తరఫున మళ్లీ ఆడాలనుకుందన్న ఆశను పలుమార్లు వ్యక్తపరిచాడు. 


logo