Sports
- Dec 23, 2020 , 00:00:48
భారీ ధరకు బ్రాడ్‌మన్ క్యాప్

సిడ్నీ: ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్, ఆస్ట్రేలియా దిగ్గజం డొనాల్డ్ బ్రాడ్‌మన్ తొలి టెస్టులో ధరించిన క్యాప్‌నకు వేలంలో భారీ ధర పలికింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్త 3.4లక్షల డాలర్లు(దాదాపు రూ.2.51కోట్లు) వెచ్చించి ఆ బ్యాగీ గ్రీన్(ఆసీస్ టెస్టు క్యాప్)ను దక్కించుకున్నారు. ఓ క్రికెట్ జ్ఞాపకానికి దక్కిన రెండో భారీ మొత్తంగా ఇది రికార్డు సృష్టించింది.
ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ టెస్టు క్యాప్ ఈ ఏడాది మొదట్లో దాదాపు రూ.5.6కోట్లకు అమ్ముడై ఆ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా తరఫున 1928 నుంచి 1948 వరకు 52 టెస్టులు ఆడిన బ్రాడ్‌మన్ 99.94 సగటుతో ఎవరూ అందుకోలేని మార్క్‌ను సెట్ చేశాడు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
MOST READ
TRENDING