శనివారం 06 మార్చి 2021
Sports - Feb 20, 2021 , 12:47:32

మొతెరా స్ట‌న్నింగ్ లుక్‌.. క్రికెట‌ర్లు ఫిదా

మొతెరా స్ట‌న్నింగ్ లుక్‌.. క్రికెట‌ర్లు ఫిదా

అహ్మ‌దాబాద్‌:  మొతెరా స్టేడియం మంత్రముగ్దుల్ని చేస్తోంది.  కొత్త స్టేడియం చూసిన క్రికెట‌ర్లు థ్రిల్ ఫీల‌వుతున్నారు.  ఇంగ్లండ్‌, భార‌త్ మ‌ధ్య ఈనెల 24వ తేదీన అహ్మ‌దాబాద్‌లోని మొతెరా స్టేడియంలో మూడ‌వ టెస్టు మ్యాచ్ ప్రారంభంకానున్న‌ది. నాలుగ‌వ టెస్ట్ కూడా ఇక్క‌డే జ‌ర‌గ‌నున్న‌ది. ఇక ఆ త‌ర్వాత అయిదు టీ20ల‌కు కూడా మొతెరానే వేదిక కానున్న‌ది. అయితే ప్ర‌పంచంలోనే అతిపెద్ద స్టేడియంగా ఇప్పుడు మొతెరా అంద‌ర్నీ అట్రాక్ట్ చేస్తున్న‌ది. కొత్త స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు వ‌చ్చిన క్రికెట‌ర్లు మొతెరా అందాల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  సుమారు ల‌క్షా ప‌ది వేల మంది ప్రేక్ష‌కుల సామ‌ర్థ్యం ఉన్న ఆ స్టేడియం లుక్‌ను చూసి స్ట‌న్ అవుతున్నారు. ఇంగ్లండ్ క్రికెట‌ర్ల‌తో పాటు భార‌త క్రికెట‌ర్లు కూడా మొతెరా బ్యూటీకి బౌల్డ‌వుతున్నారు.  

ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ ప్యాండ్ కొత్త స్టేడియంలో దిగిన సెల్ఫీ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు.  ప్ర‌పంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో అనుభూతి అద్భుతంగా ఉంద‌న్నాడు.  ఇంగ్లండ్ మాజీ ప్లేయ‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ కూడా స్టేడియంపై కామెంట్ చేశారు.  బాబోయే.. ఏంటీ ఈ స్టేడియం అన్న ఆశ్చ‌ర్యాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.  మొతెరా స్టేడియం సూప‌ర్‌గా ఉందంటూ.. ఏ థియేట‌ర్ ఆఫ్ డ్రీమ్స్ అని పీట‌ర్స‌న్ ట్వీట్ చేశాడు. మరో ఇంగ్లండ్ ప్లేయ‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ కూడా స్టేడియం గురించి ఓ ట్వీట్ చేశాడు. ల‌క్షా ప‌ది వేల సామ‌ర్థ్యం క‌లిగిన స్టేడియం అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశాడు.  

భార‌త వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ కూడా మొతెరా అందాల్ని తెగ మెచ్చుకున్నాడు.  కొత్త స్టేడియంలో ఆడ‌డం ఆనందంగా ఉంద‌న్నాడు. ప్ర‌పంచ స్థాయి స‌దుపాయాలు ఉన్న‌ట్లు త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ కూడా థ్రిల్ వ్య‌క్తం చేశాడు. ప్లేయ‌ర్లు స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న వీయోను పోస్టు చేశాడు.  క‌ల‌ర్‌ఫుల్‌గా ఉన్న మొతెరా స్టేడియంలో.. ఇర దేశాల ఆట‌గాళ్లు జోరుగా ప్రాక్టీసు చేస్తున్నారు. 

VIDEOS

logo