శుక్రవారం 05 జూన్ 2020
Sports - Apr 02, 2020 , 22:51:38

‘డక్‌వర్త్‌' సృష్టికర్త లూయిస్‌ మృతి

‘డక్‌వర్త్‌' సృష్టికర్త లూయిస్‌ మృతి

లండన్‌: పరిమిత ఓవర్ల క్రికెట్‌ వాతావరణం వల్ల ప్రభావితమైతే వినియోగిస్తున్న డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి సృష్టికర్తల్లో ఒకరైన టోనీ లూయిస్‌ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) వెల్లడించింది. గణిత శాస్త్రజ్ఞుడైన టోనీ లూ యిస్‌.. ఫ్రాంక్‌ డక్‌వర్త్‌తో కలిసి డక్‌వర్త్‌ లూ యిస్‌ పద్ధతిని 1997లో ఆవిష్కరించారు. 1999 నుంచి   ఐసీసీ  ఈ విధానాన్ని వినియోగిస్తున్నది. కొన్నిసార్లు డక్‌వర్త్‌  లూయిస్‌ పద్ధతిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 


logo