మీ త్యాగాలను మరచిపోము.. థ్యాంక్స్ చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా

మెల్బోర్న్: ఆస్ట్రేలియా టూర్‌ను విజయవంతంగా ముగించిన ఇండియన్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ మేరకు బీసీసీఐకి ఓ లేఖ రాసి ట్విటర్లో పోస్ట్ చేసింది. కరోనా మహమ్మారి విజృంభించిన వేళ.. ఎన్నో సవాళ్ల మధ్య కూడా బీసీసీఐలోని మా మిత్రుల వల్లే ఈ టూర్ విజయవంతమైందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రశంసించింది. మీ త్యాగాలను ఎప్పుడూ మరచిపోము అని కూడా అనడం విశేషం. మీ స్నేహం, నమ్మకం, నిబద్ధతకు ఆస్ట్రేలియన్ క్రికెట్ ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సిరీస్ ప్రపంచంలోని ఎన్నో కోట్ల మందిలో ఆనందం నింపిందని ఆ లేఖలో క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. టూర్లో భాగంగా వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలవగా.. టీ20, టెస్ట్ సిరీస్‌లను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. ఈ టూర్లో ఇండియన్ టీమ్ చూపించిన ధైర్యం, లాఘవం, నైపుణ్యానికి క్రికెట్ ఆస్ట్రేలియాలోని ప్రతి ఒక్కరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొంది
An open letter to our friends in Indian Cricket, and to everyone who played their part to help deliver this memorable series! ???????? @BCCI pic.twitter.com/rk4cluCjEz
— Cricket Australia (@CricketAus) January 20, 2021
తాజావార్తలు
- రైతు ఆదాయం రెట్టింపు ఎలా?
- చమురు ధరల పెంపు అహేతుకం
- మళ్లీ పుంజుకున్న బిట్‌కాయిన్
- నీతిమాలిన నిందలు
- హిందుత్వానికి అసలైన ప్రతీక
- కోటక్ చేతికి ఆర్మీ జవాన్ల వేతన ఖాతాలు!
- అదనపు భద్రత+ ఏబీఎస్‌తో విపణిలోకి బజాజ్ ప్లాటినా-110
- మిల్క్ టూ వంటనూనెల ధరలు ‘భగభగ’!..
- ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్‌రావుకు చిన్నచూపు
- ప్రైవేట్ ఉద్యోగాల రిజర్వేషన్ హర్యానాకు డిజాస్టర్:ఫిక్కీ