క్రెడిట్ అంతా సిరాజ్కే దక్కుతుంది: అజింక్య

న్యూఢిల్లీ: హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానె ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రతి నెట్ సెషన్లో ఈ భారత పేసర్ నిజంగా కష్టపడి పనిచేశాడని కితాబిచ్చాడు. బంతితో అతడి అద్భుత ప్రదర్శన వల్లనే ఈ ఘనత సాధించామని తెలిపారు. మొదటి టెస్ట్ సిరీస్‌లో భారత్ పేసర్ తన తండ్రి చనిపోయినప్పటికీ కడుపులో ఎంతో బాధపెట్టుకుని కూడా ఎలా పోరాడాలో సిరాజ్ చూపించాడన్నారు.
సిరాజ్ తండ్రి మొహమ్మద్ గౌస్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు గత నవంబర్ 20 న కన్నుమూశారు. సిడ్నీ క్రికెట్ మైదానంలో అక్కడి ప్రేక్షకుల నుంచి జాత్యహంకార నినాదాలను కూడా సిరాజ్ ఎదుర్కొని నిలువాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో సిరాజ్ పాత్ర అమోఘమైందన్నారు. మెల్బోర్న్లో జరిగిన రెండవ టెస్ట్‌లో అరంగేట్రం చేసిన తరువాత తన సీనియర్ పేస్ సహచరుల సహకారంతో విజయవంతంగా టెస్టుల్లోకి అడుగుపెట్టాడు. "సిరీస్ ప్రారంభంలో తన తండ్రిని కోల్పోయాడు. కానీ, అతను మానసికంగా కఠినంగా ఉన్నాడు. అతను జట్టుతో కలిసి ఉండాలని కోరుకున్నాను. ఆయనకే ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది" అని రహానే ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రతి నెట్ సెషన్లో సిరాజ్ చాలా కష్టపడ్డాడని, అతను బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుందని మొదటిరోజే భావించానని రహానే చెప్పారు.
మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియాలో తన తొలి సిరీస్‌లో 3 టెస్ట్ మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. మెల్బోర్న్లో అరంగేట్రం చేయడం నుంచి బ్రిస్బేన్‌లో టీమిండియా దాడికి నాయకత్వం వహించడం వరకు.. సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శన ప్రపంచం దృష్టిని ఆకర్శించింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.