బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Aug 14, 2020 , 16:44:29

తాహిర్ అంకిత‌భావం గ‌ల ఆట‌గాడు: నెహ్రా

తాహిర్ అంకిత‌భావం గ‌ల ఆట‌గాడు:  నెహ్రా

 న్యూఢిల్లీ: క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో పాల్గొన‌డం ఐపీఎల్‌లో ఆడ‌బోయే ఆట‌గాళ్ల‌కు లాభం చేకూరుస్తుంద‌ని భార‌త మాజీ పేస‌ర్ ఆశీష్ నెహ్రా అభిప్రాయ‌ప‌డ్డాడు. సెప్టెంబ‌ర్ 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న 13వ సీజ‌న్ కోసం ఫ్రాంచైజీలు స‌న్నాహ‌కాలు మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నెహ్రా మాట్లాడుతూ..

`క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో ఆడిన ఆట‌గాళ్లు.. అదే ప్ర‌ద‌ర్శ‌న‌ను ఐపీఎల్‌లో పున‌రావృతం చేయాల‌ని లేదు కానీ.. క‌చ్చితంగా వారికి అది దోహ‌ద‌ప‌డుతుంది. బ్రావో, పొలార్డ్‌, తాహిర్ వంటి ఆట‌గాళ్లు ఎక్క‌డైనా స‌త్తాచాట‌గ‌ల‌రు. ఇమ్రాన్ తాహిర్ విష‌యానికి వ‌స్తే అత‌డు అంకిత భావం గ‌ల ఆట‌గాడు`అని చెప్పాడు. logo