సోమవారం 30 నవంబర్ 2020
Sports - Apr 12, 2020 , 23:55:34

అవి సమస్యలే కావు

అవి సమస్యలే కావు

న్యూఢిల్లీ: కొవిడ్‌-19ను సమర్ధంగా ఎదుర్కోవాలంటే.. స్వీయ నిర్బంధమే ఉత్తమమని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటించాలని సూచించాడు. ఆదివారం ట్విట్టర్‌  వీడియోలో వీరూ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం మనం ఇండ్ల నుంచి బయటకు రాలేకపోవచ్చు.. ఉదయం వాకింగ్‌, జాగింగ్‌కు వెళ్లలేకపోవచ్చు. షాపింగ్‌మాల్స్‌కు వెళ్లే అవకాశం లేకపోవచ్చు. ఇవన్నీ మీకు సమస్యలుగా కనిపించవచ్చు. కానీ జీవితంలో ఇవేవీ పెద్ద ఇబ్బందులు కావు. మన కోసం వైద్య, పోలీస్‌, పారిశుధ్య సిబ్బంది ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతున్నారు. అందుకే ఈ సమయంలో మనం ఇంటి నుంచి బయటకు రాకుండా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటించాల్సిన అవసరముంది’ అని అన్నాడు.