ఆదివారం 24 మే 2020
Sports - Mar 13, 2020 , 10:25:36

ఖాళీ స్టేడియంలో జ‌రుగుతున్న కివీస్‌- ఆస్ట్రేలియా మ్యాచ్

ఖాళీ స్టేడియంలో జ‌రుగుతున్న కివీస్‌- ఆస్ట్రేలియా మ్యాచ్

కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌తి ఒక్క రంగాన్ని కాటేస్తుంది. ముఖ్యంగా క్రికెట్ ప్రేమికుల‌ని క‌రోనా భూతం తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. ప్ర‌స్తుతం  క‌రోనా వ‌ల‌న గ్రౌండ్‌లోకి  ప్రేక్ష‌కుల‌ని అనుమ‌తించ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఒక్క వీక్ష‌కుడు లేకుండా మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి. కొద్దిసేప‌టి క్రితం  సిడ్నీలో  ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మ‌ధ్య వ‌న్డే మ్యాచ్ మొద‌లు కాగా, వీక్ష‌కులు లేకుండా మ్యాచ్ జ‌రుగుతుంది. ముందుగానే ఈ మ్యాచ్‌లకు స్టేడియంలో ప్రేక్షకులను అనుమతించరాదని ఆస్ట్రేలియా బోర్డ్‌ నిర్ణయించింది. టికెట్ల అమ్మకాలు కూడా నిలిపివేశారు.  దీంతో స్టాండ్స్ అన్నీ బోసిపోయాయి. ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. 22 ఓవ‌ర్ల‌కి గాను ఆసీస్ వికెట్ న‌ష్ట‌పోకుండా 114 ప‌రుగులు చేసింది.  ఓపెన‌ర్లు వార్న‌ర్‌, ఫించ్ అర్ధ సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు. మ‌రోవైపు ప్ర‌తిష్టాత్మ‌క ఐపీఎల్ సిరీస్‌తో పాటు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇండియా- సౌతాఫ్రికా సిరీస్‌పై కూడా క‌రోనా ఎఫెక్ట్ ఉన్న సంగ‌తి తెలిసిందే.  


logo