బుధవారం 03 జూన్ 2020
Sports - Mar 31, 2020 , 11:42:08

రోహిత్ భారీ విరాళం: వీధి శునకాల పోషణకు కూడా..

రోహిత్ భారీ విరాళం: వీధి శునకాల పోషణకు కూడా..

ముంబై: కరోనా మహమ్మారిపై పోరాటానికి క్రీడాలోకం కదిలివస్తున్నది. టీమ్​ఇండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా సాయం చేసుందుకు ముందుకొస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత స్టార్ ఓపెనర్​ రోహిత్ శర్మ చేరాడు. మొత్తం రూ.80లక్షలను విరాళంగా ప్రకటించాడు. పీఎం-కేర్స్ నిధికి రూ.45లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25లక్షలు, ఫీడింగ్ ఇండియా, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థలకు చెరో రూ.5లక్షలు అందించినట్టు మంగళవారం రోహిత్ శర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దేశం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవాలని, ఇందుకోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రోహిత్ గుర్తు చేశాడు. కరోనాపై యుద్ధంలో ప్రధాని మోదీతో పాటు నాయకులకు మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చాడు. వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థకు విరాళమిచ్చి.. వీధి శునకాల సంక్షేమానికి హిట్​మ్యాన్  తోడ్పాటునందించాడు. జంతు ప్రేమికుడిగా మరోసారి నిరూపించుకున్నాడు.

ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ దంపతులు, ఓపెనర్​ ధవన్​, రహానే, రైనాతో పాటు మరికొందరు క్రికెటర్లు విరాళాలు ఇచ్చారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ.50లక్షల విలువైన బియ్యాన్ని అవసరార్థులకు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించాడు. 



logo