శనివారం 30 మే 2020
Sports - Apr 10, 2020 , 18:40:52

నెలరోజుల పాటు 5వేలమందికి సచిన్ సాయం

నెలరోజుల పాటు 5వేలమందికి సచిన్ సాయం

ముంబై: కరోనా సంక్షోభ సమయంలో 5వేల మంది అవసరార్థులకు సాయం చేసేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముందుకొచ్చాడు. నెల రోజుల పాటు 5వేల మందికి నిత్యావసరాలు అందించేందుకు గాను అప్నాలయ అనే స్వచ్ఛంద సంస్థకు మాస్టర్ చేయూతనిచ్చాడు. దీంతో సచిన్​కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ సంస్థ ట్వీట్ చేయగా.. మాస్టర్​ స్పందించాడు. “అవసరార్థులు, ఇబ్బందుల్లో వారికి సేవలను కొనసాగించేందుకు అప్నాలయకు మరింత మంచి జరగాలని కోరుకుంటున్నా. మంచి పనిని కొనసాగించండి” అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.

కరోనాపై యుద్ధం కోసం సచిన్ ఇప్పటికే రూ.50లక్షలను విరాళంగా ప్రకటించాడు. చెరో రూ.25లక్షలను పీఎం సహాయ నిధి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశాడు. 


logo