శనివారం 04 జూలై 2020
Sports - Apr 28, 2020 , 23:38:24

మాజీ క్రికెటర్ల కోసం అజారుద్దీన్ విరాళం

మాజీ క్రికెటర్ల కోసం అజారుద్దీన్ విరాళం

న్యూఢిల్లీ: లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న మాజీ క్రికెటర్లకు సాయం చేసేందుకు భారత క్రికెట్​ సంఘం(ఐసీఏ) రూ.24లక్షల నిధులను సమీకరించింది. ఇందుకోసం టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​, హెచ్​సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ రూ.లక్ష విరాళమిచ్చాడు. ఐసీఏ రూ.10లక్షలు ఇవ్వగా.. సంఘంలోని మిగిలిన సభ్యులు భాగస్వాములయ్యారు. “విరాళాల కోసం శుక్రవారం పిలుపునివ్వగా ఇప్పటి వరకు రూ.24లక్షల నిధులు సమకూరాయి. రానున్న రోజుల్లో నిధులు మరింత వృద్ధి చెందుతాయనే నమ్మకంతో ఉన్నా. దీనివల్ల మరింత మంది మాజీ ప్లేయర్లకు సాయం చేసేందుకు వీలవుతుంది. ప్రస్తుతం వచ్చిన మొత్తంతో అవసరార్థులైన 25 నుంచి 30మంది మాజీ ప్లేయర్లకు సాయం చేస్తాం. ఆ తర్వాత మరింత మందికి చేయూతనిచ్చేందుకు ప్రయత్నిస్తాం” అని ఐసీఏ అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా మంగళవారం ప్రకటించారు. అలాగే ప్రధాన ఆటగాళ్ల భాగస్వామ్యం కొరవడడంపై మల్హోత్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. మే 16వ తేదీ వరకు నిధుల సమీకరణ కార్యక్రమం కొనసాగనుంది.  


logo