సోమవారం 13 జూలై 2020
Sports - Jun 24, 2020 , 21:54:18

ఇంగ్లాండ్‌ క్రికెటర్లకు కరోనా పరీక్షలు.. నో పాజిటివ్‌

ఇంగ్లాండ్‌ క్రికెటర్లకు కరోనా పరీక్షలు.. నో పాజిటివ్‌

లండన్‌ : క్రీడలపై కూడా మహమ్మారి ప్రభావం పడుతున్నది. ఇప్పటికే పలువురు క్రీడాకారులు వైరస్‌ బారిన పడ్డారు. పాకిస్తాన్‌లో పది మంది వరకు క్రికెటర్లు, స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ జొకోవిచ్‌తో పాటు పలువురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ క్రికెటర్లు, సహాయ సిబ్బందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయించింది. ఇందులో ఎవరికీ వైరస్‌ సోకలేదని తేలిందని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బుధవారం తెలిపింది. జూన్‌ 3 నుంచి 23 వరకు దాదాపు 702 శాంపిళ్లు పరీక్ష చేయించామని, అన్ని నెగెటివ్‌ వచ్చినట్లు పేర్కొంది. కాగా, వెస్టిండీస్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆగేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారని తెలిపింది. ఇంగ్లాండ్‌ - వెస్టిండ్‌ మధ్య రోజ్ బౌల్ క్రికెట్ గ్రౌండ్‌లో జూలై 8న తొలి టెస్టు ప్రారంభం కానుంది. 


logo