శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Sports - Jul 10, 2020 , 00:44:34

ప్రయాణం సురక్షితమైతే దేశవాళీ క్రికెట్‌: దాదా

ప్రయాణం సురక్షితమైతే దేశవాళీ క్రికెట్‌: దాదా

ముంబై: రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల కోసం దేశంలో ప్రయాణాలు సురక్షితమైనప్పుడే ఈ ఏడాది దేశవాళీ సీజన్‌ మొదలవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. అక్టోబర్‌లో ఐపీఎల్‌ జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దేశవాళీ సీజన్‌పై సందిగ్ధత తీవ్రమైంది. దీంతో ఈ విషయంపై గంగూలీ స్పందించాడు. ‘దేశవాళీ క్రికెట్‌ జరుగడం ముఖ్యమే. కానీ కరోనా వైరస్‌ ప్రభావం ముగిశాకే. జూనియర్‌ క్రికెట్‌ ఆడేందుకు సురక్షితమైన వాతావరణం ఏర్పడినప్పుడే సీజన్‌ మొదలవ్వాలి. ఎందుకంటే దేశవాళీ క్రికెట్‌ కోసం యువ ఆటగాళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ప్రయాణాలు సురక్షితమైనప్పుడు మాత్రమే దేశవాళీ క్రికెట్‌ ప్రారంభమవుతుంది’ అని గంగూలీ వివరించాడు. ఈ ఏడాది ఆగస్టులో విజయ్‌ హజారే ట్రోఫీతో దేశవాళీ సీజన్‌ మొదలవ్వాల్సి ఉండగా... ఆ తర్వాత రంజీ ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ జరుగాల్సిఉంది. ఈ ఏడాది తొలిదశ లాక్‌డౌన్‌ సమయంలోనే ఇరానీ కప్‌ రద్దయింది.  


logo