ఆదివారం 09 ఆగస్టు 2020
Sports - Jul 11, 2020 , 15:36:58

కొవిడ్‌ తెచ్చిన కష్టం.. శిక్షణ‌ కోసం కారు అమ్మేస్తానంటున్న అథ్లెట్‌ ద్యుతిచంద్‌

కొవిడ్‌ తెచ్చిన కష్టం.. శిక్షణ‌ కోసం కారు అమ్మేస్తానంటున్న అథ్లెట్‌ ద్యుతిచంద్‌

న్యూ ఢిల్లీ: కొవిడ్‌తో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయడం వల్ల ఇండియన్‌ అథ్లెట్‌ ద్యుతిచంద్‌ నిధుల కొరతతో సతమతమవుతున్నది. దీంతో ఆమె శిక్షణ ఖర్చుల కోసం తన కారును అమ్మేయాలని నిర్ణయించుకున్నది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఇప్పటివరకు శిక్షణ చాలా బాగుంది. నేను ఇక్కడ భువనేశ్వర్‌లో శిక్షణ పొందుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, స్పాన్సర్లు ఇచ్చిన నిధులన్నీ కోచింగ్‌కు ఖర్చు చేశా. ప్రస్తుతం ఒలింపిక్స్‌ వాయిదాపడింది. ఇప్పుడు స్టేట్‌ గవర్నమెంట్‌ దగ్గర డబ్బులు లేవు. కరోనా కారణంగా స్పాన్సర్లనూ అడగలేను. అందుకే నా కారు అమ్మేయాలని నిర్ణయించుకున్నా.’ అని ద్యుతిచంద్‌ పేర్కొన్నారు.  

ద్యుతిచంద్‌ ఇటీవల అర్జున అవార్డు 2020కి ఎంపికైంది. ఆమె ఆసియా గేమ్స్‌లో రెండుసార్లు రజత పతకాలు సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ప్రస్తుతం ద్యుతి సిద్ధమవుతోంది. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలల విరామం తర్వాత మే 25న చంద్ కళింగ స్టేడియంలో శిక్షణను ప్రారంభించింది. ఒలింపిక్స్‌ వాయిదాపడడంతో ఆమె పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ కోసం మరో ఏడాది శిక్షణ తీసుకోవాల్సి ఉంది.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo