ఆదివారం 29 మార్చి 2020
Sports - Mar 01, 2020 , 00:20:21

ద్యుతి రికార్డు పసిడి

 ద్యుతి రికార్డు పసిడి

భువనేశ్వర్‌: భారత స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ మరోమారు తళుక్కుమం ది. ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో మహిళల 100 మీటర్ల రేసులో బరిలోకి దిగిన ద్యుతి 11.49 సెకన్ల టైమింగ్‌తో పసి డి పతకాన్ని కైవసం చేసుకుంది. ధనలక్ష్మి(11.99 సె., మంగళూరు విశ్వవిద్యాలయం), స్నేహ (12.8 సె., మహాత్మా గాంధీ వర్సిటీ) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయం టేబుల్‌ టెన్నిస్‌ జట్టు సెమీస్‌లో 3-1తో మద్రాస్‌ వర్సిటీపై నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది.


logo