సోమవారం 23 నవంబర్ 2020
Sports - Oct 01, 2020 , 16:27:39

KXIP vs MI: కాట్రెల్‌ స్థానంలో ముజీబ్‌ రెహమాన్‌?

KXIP vs MI: కాట్రెల్‌ స్థానంలో ముజీబ్‌ రెహమాన్‌?

అబుదాబి: ఐపీఎల్‌-13వ సీజన్‌లో వెస్టిండీస్‌  ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డన్‌  కాట్రెల్‌,  రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రాహుల్‌  తెవాటియా గురించి పరిచయం అక్కర్లేదు.  కాట్రెల్‌ ఓవర్‌లో ఆరు బంతుల్లో ఐదు సిక్సర్లు  బాదిన రాహుల్‌ రాత్రికి రాత్రే హీరో  అయ్యాడు.  పేలవ బౌలింగ్‌ జట్టు ఓటమికి కారణమైన కాట్రెల్‌ను తుది జట్టు నుంచి తప్పించాలని కింగ్స్‌ ఎలెవన్‌  పంజాబ్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు   కాట్రెల్‌  స్థానంలో అఫ్గనిస్థాన్‌ యువ స్పిన్నర్‌ ముజీబ్‌ రెహమాన్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. 

అబుదాబిలోని మైదానం షార్జా కన్నా చాలా పెద్దది.. ఈ గ్రౌండ్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారు. దీంతో గత మ్యాచ్‌లో   తేలిపోయిన కాట్రెల్‌ స్థానంలో రెహమాన్‌ను తుదిజట్టులోకి ఎంపిక చేయాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచిస్తోంది.  ఒకవేళ స్పిన్నర్‌ ముజీబ్‌ను ఎంపిక చేస్తే భారత స్పిన్నర్‌ ఎం. అశ్విన్‌కు విశ్రాంతినిచ్చి మరో భారత పేసర్‌ ఇషాన్‌ పొరెల్‌ను ఆడించే అవకాశం ఉన్నది.