శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Mar 24, 2020 , 22:58:08

గోపీచంద్‌కు కరోనా పరీక్షలు

 గోపీచంద్‌కు కరోనా పరీక్షలు

శంకర్‌పల్లి రూరల్‌: భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇటీవలే బర్మింగ్‌హామ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న గోపీచంద్‌.. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీలోని జనవాడ శివారులోని తన ఫామ్‌హౌజ్‌లో ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న  వైద్య సిబ్బంది.. తాసీల్దార్‌ కృష్ణకుమార్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ మృదుల..గోపీచంద్‌ను పరీక్షించారు.


logo