మంగళవారం 07 జూలై 2020
Sports - Mar 26, 2020 , 22:37:00

టర్కీ బాక్సర్‌కు కరోనా

టర్కీ బాక్సర్‌కు కరోనా

న్యూఢిల్లీ: టర్కీకి చెందిన ఇద్దరు బాక్సర్లు ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఒలింపిక్స్‌ దేశాలకు వెళ్లిన ఇద్దరు బాక్సర్లతో పాటు వారి  చీఫ్‌ కోచ్‌ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డాడు. ఈ అర్హత పోటీల్లో 40 దేశాలకు చెందిన 350 మంది బాక్సర్లు పాల్గొన్నారు. టోర్నీ ప్రారంభమైన మూడు రోజుల అనంతరం కరోన కారణంగా ఈ పోటీలను నిలిపివేశారు.

దీంతో  తిరుగు పయనమైన బాక్సర్లకు పరీక్షలు నిర్వహించగా.. అందులో కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో టర్కీ బాక్సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు యుప్‌ గోష్‌గేక్‌ ఐవోసీ తీరును తప్పుపట్టాడు. వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ప్రపంచమంతా సామాజిక దూరం పాటిస్తుంటే.. ఐవోసీ మాత్రం ఆటగాళ్ల ప్రాణాలతో చెలగాటలాడుతుందని దుయ్యబట్టారు. ఈ అర్హత టోర్నీని నిర్వహించడం ముమ్మాటికి ఐవోసీ నిర్లక్ష్యమే అని అన్నారు. logo