శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Mar 24, 2020 , 00:03:31

స్వీయ నిర్బంధంలో సంగక్కర

స్వీయ నిర్బంధంలో సంగక్కర

కొలంబో: శ్రీలంక బ్యాటింగ్‌ దిగ్గజం కుమార సంగక్కర స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. కరోనా మహమ్మారి కోరలు చాస్తుండటంతో ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం ఇంటికే పరిమితమైనట్లు సోమవారం వెల్లడించాడు. ‘కొవిడ్‌-19 లక్షణాలు లేకపోయినా.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నా. వారం రోజుల క్రితం లండన్‌ నుంచి వచ్చా. మార్చి 1 నుంచి 15 మధ్య విదేశాల నుంచి వచ్చినవారు భద్రతా సిబ్బంది వద్ద పేరు నమోదు చేసుకొని నిర్బంధంలోకి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకే ప్రజాహితం కోసం మార్గదర్శకాలను పాటిస్తున్నా’అని సంగక్కర తెలిపాడు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో సంగక్కరతో పాటు మరో మాజీ కెప్టెన్‌ మహేల జయవర్ధనే సోషల్‌ మీడియా ద్వారా ‘క్లిష్ట కాలంలో ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి’ అని విజ్ఞప్తి చేశాడు.


logo