శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 20, 2020 , 18:42:13

‘ది హండ్రెడ్‌’ లీగ్‌ నుంచి తప్పుకున్న వార్నర్‌

 ‘ది హండ్రెడ్‌’ లీగ్‌ నుంచి తప్పుకున్న వార్నర్‌

సిడ్నీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19) కారణంగా అంతర్జాతీయంగా జరగాల్సిన క్రీడా ఈవెంట్లు రద్దు కాగా..మరికొన్ని వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ‘ది హండ్రెడ్‌’ లీగ్‌ నుంచి తప్పుకున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా లీగ్‌ నుంచి తప్పుకోలేదని జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు.  ‘ది హండ్రెడ్‌’ లీగ్‌లో వార్నర్‌.. సదరన్‌ బ్రేవ్‌ జట్టు తరఫున ఆడాల్సి ఉంది.  ఒకవేళ ఐపీఎల్‌-2020 సీజన్‌ జరిగితే 33ఏండ్ల ఆసీస్‌ ఓపెనర్‌ ఆడతాడని వార్నర్‌ మేనేజర్‌ వెల్లడించాడు. మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్‌ను కరోనా వల్ల ఏప్రిల్‌ 15కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

అసలేంటీ హండ్రెడ్‌ లీగ్‌..

జులై 17 నుంచి ది హండ్రెడ్‌ టోర్నీ ఆరంభంకానుంది. ఇంగ్లాండ్‌ వేదికగా ఈ లీగ్‌లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ఒక ఇన్నింగ్స్‌కు 100 బంతులు మాత్రమే ఉండడం ఈ లీగ్‌ స్పెషాలిటీ. ఒక్కో బౌలర్‌ గరిష్టంగా 20బంతులు మాత్రమే బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రతీ ఇన్నింగ్స్‌లో మొదటి 25బంతుల వరకు పవర్‌ ప్లే ఉంటుంది. 


logo