బుధవారం 03 జూన్ 2020
Sports - Mar 29, 2020 , 23:55:37

జోగిందర్‌.. రియల్‌ హీరో

జోగిందర్‌.. రియల్‌ హీరో

  • మాజీ క్రికెటర్‌పై ఐసీసీ ప్రశంస 

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుతం హర్యానాలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న జోగిందర్‌ శర్మను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ప్రశంసించింది. కరోనా సంక్షోభం కారణంగా లాక్‌డౌన్‌లో పని చేస్తున్న అతడిని రియల్‌ హీరో అంటూ ఆదివారం ట్వీట్‌ చేసింది. క్రికెట్‌ కెరీర్‌ తర్వాత పోలీస్‌గా మారిన జోగిందర్‌ శర్మ.. ప్రపంచం ఆరోగ్య సంక్షోభం ఉన్న సమయంలోనూ పనిచేస్తున్నాడు. 2007: ప్రపంచకప్‌ హీరో.. 2020: రియల్‌ హీరో అంటూ ఐసీసీ ట్వీట్‌ చేసింది. 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ చివరి ఓవర్లో పాక్‌ బ్యాట్స్‌మన్‌ మి స్బాను ఔట్‌ చేసి టీమ్‌ఇండియాను జోగిందర్‌ గెలిపించిన సంగతి తెలిసిందే. 


logo