శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 07, 2020 , 01:41:18

షూటింగ్‌ ప్రపంచకప్‌ వాయిదా

 షూటింగ్‌ ప్రపంచకప్‌ వాయిదా

న్యూఢిల్లీ: క్రీడలపై కరోనా వైరస్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 15 నుంచి జరగాల్సిన షూటింగ్‌ ప్రపంచకప్‌ కరోనా కారణంగా మే నెలకు వాయిదా పడింది. మే 5 నుంచి 12 వరకు రైఫిల్‌ పో టీలు, జూన్‌ 2 నుంచి 9 వరకు షాట్‌గన్‌ పో టీలు నిర్వహిస్తామని  ఎన్‌ఆర్‌ఏఐ తెలిపింది. మరోవైపు కరోనా భయంతో భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) కేంద్రాల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ‘సాయ్‌' తెలిపింది.
logo