Sports
- Dec 02, 2020 , 02:06:40
హామిల్టన్‌కు కరోనా

షాకిర్(బహ్రయిన్): ఏడు సార్లు ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో బహ్రయిన్ అంతర్జాతీయ సర్క్యూట్‌పై ఈ వారాంతంలో జరిగే షాకిర్ గ్రాండ్‌ప్రికి అతడు దూరమయ్యాడు. గత వారం నిర్వహించిన మూడు కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్ధారణ అయి, ఇదే సర్క్యూట్‌పై గ్రాండ్‌ప్రి టైటిల్‌ను హామిల్టన్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. షాకిర్ రేస్‌కు ముందు చేసిన పరీక్షలో హామిల్టన్‌కు పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని మెర్సిడెజ్ - ఏజీఎం పెట్రోనాస్ ఎఫ్ వన్ జట్టు మంగళవారం ప్రకటించింది. ‘సోమవారం స్వల్ప లక్షణాలు కనిపించడంతో హామిల్టన్‌కు కరోనా పరీక్షలు జరిగాయి. ఫలితం పాజిటివ్‌గా వచ్చింది. మరోసారి టెస్టు చేసిన ఇదే నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు మినహా హామిల్టన్ పూర్తి క్షేమంగా ఉన్నాడు’ అని జట్టు వెల్లడించింది.
తాజావార్తలు
- ‘కొవిడ్ నెగెటివ్’ నిబంధన ఎత్తేసిన పూరీ జగన్నాథ్ ట్రస్ట్
- శాకుంతలం చిత్రంపై గాసిప్స్.. క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్
- పాతబస్తీలో పేలిన సిలిండర్.. 13 మందికి గాయాలు
- అరుణాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ కన్నుమూత
- ఈ రాశులవారికి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
MOST READ
TRENDING