శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 28, 2020 , 21:33:25

రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌కు కరోనా పాజిటివ్‌

రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌కు కరోనా పాజిటివ్‌

భారత అగ్రశ్రేణి మహిళా రెజ్లర్ వినేశ్‌ ఫోగట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని వినేశ్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా శుక్రవారం తెలియజేశారు. ఈ సంవత్సరం ఖేల్ రత్నా అవార్డుకు ఎంపికైన వారిలో వినేశ్‌ ఫోగట్‌ కూడా ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించిన ఫోగట్‌.. ప్రస్తుతం కోచ్‌ ఓం ప్రకాశ్‌తో కలిసి తన గ్రామం సోనెపట్‌లో శిక్షణ పొందుతున్నారు.

‘నిన్న చేయించుకున్న కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు లేవు. కానీ ప్రస్తుతం నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా వేరుగా ఉన్నారు. ఇటీవల నాతో ప్రాథమిక కాంటాక్టులో ఉన్నవారందరు కూడా పరీక్షలు చేయించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నా. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి! ధన్యవాదాలు’ అని ఆమె శుక్రవారం ట్వీట్‌ చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo