సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Mar 20, 2020 , 23:46:17

షాక్‌లో భారత షట్లర్లు

 షాక్‌లో భారత షట్లర్లు

  • థాయ్‌లాండ్‌ ఆటగాడికి కరోనా 

న్యూఢిల్లీ: ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీలో థాయ్‌లాండ్‌ ఆటగాడికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో భారత షట్లర్లు భయాందోళనకు గురువుతున్నారు. బర్మింగ్‌హామ్‌లో ఇటీవలే ముగిసిన ఈ టోర్నీలో పోటీకి దిగిన సైనా నెహ్వాల్‌, అశ్విని పొన్నప్ప..షాక్‌కు గురువుతూ ట్విట్టర్‌లో తమ సందేశాలను పోస్ట్‌ చేశారు. ‘నో వే రియల్లీ షాక్డ్‌' అంటూ సైనా ట్వీట్‌ చేయగా,  ‘ఓ నో’ అని అశ్విని రాసుకొచ్చింది. ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీలో బరిలోకి దిగిన సదరు థాయ్‌ ఆటగాడికి పాజిటివ్‌ అన్న విషయాన్ని డెన్మార్క్‌ ప్లేయర్‌ హెచ్‌కే విట్టింగ్స్‌ ట్విట్టర్‌ ద్వారా అందరితో పంచుకున్నాడు. 


logo