మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 10, 2020 , 12:22:10

భారత హాకీ ఆటగాడు మన్‌దీప్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌

భారత హాకీ ఆటగాడు మన్‌దీప్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌

బెంగళూరు : భారత పురుషుల హాకీ జట్టులో స్ట్రైకర్ మన్‌దీప్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే అతడికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిసింది. బెంగళూరు స్పోర్స్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఏఐ)లోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వద్ద జరిగిన జాతీయ శిబిరంలో 20 మంది ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయగా అందులో మన్‌దీప్‌సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఎస్‌ఏఐ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. 

అంతకుముందు ఆగస్టు 4న ప్రారంభమైన హాకీ జాతీయ శిబిరానికి చేరుకున్న కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్, క్రిషన్ పాథక్‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఈ ఐదుగురు ఆటగాళ్ల పరిస్థితి మెరుగ్గానే ఉందని కోచ్‌ గ్రాహం రీడ్ అన్నారు.

"నేను వారి ఐదుగురితో నిరంతరం సన్నిహితంగా ఉన్నా. వారు బాగానే ఉన్నారు. వారికి ఉత్తమ సంరక్షణ ఇవ్వడానికి ఎస్‌ఏఐ అన్ని ఏర్పాట్లు చేసింది. మెనూకు మించి ప్రత్యేకమైన వంటలు చేస్తున్నారు. అథ్లెట్లు చాలా సంతోషంగా ఉన్నారు,”అని రీడ్ చెప్పారు.

"నేను ఎస్‌ఏఐ క్యాంపస్‌లో స్వీయ నిర్బంధంలో ఉన్నాను. ఎస్‌ఏఐ అధికారులు తమకు అన్ని ఏర్పాట్లను చేశారని’’ అని కెప్టెన్‌ మన్‌ప్రీత్ చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo