ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Sep 04, 2020 , 15:59:52

సీఎస్‌కే ఆట‌గాళ్ల‌కు క‌రోనా నెగిటివ్‌.. ముంబైతో తొలిమ్యాచ్ ఆడ‌నున్న చెన్నై

సీఎస్‌కే ఆట‌గాళ్ల‌కు క‌రోనా నెగిటివ్‌.. ముంబైతో తొలిమ్యాచ్ ఆడ‌నున్న చెన్నై

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లందరికీ తాజాగా  రెండోసారి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. అంద‌రికీ నెగిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింద‌ని ఆ జ‌ట్టు ప్ర‌తినిధులు తెలియ‌జేశారు. దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్ద‌రికీ క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ప్ప‌టికీ వారు తిరిగి వ్యాధి నుంచి కోలుకోవ‌డంతో సీఎస్‌కే స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కింది. 

దీంతో సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్‌తో సీఎస్‌కే ఈ సీజ‌న్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడ‌నున్న‌ట్లు తెలిసింది. సీఎస్‌కే జ‌ట్టు సిబ్బంది, ఆట‌గాళ్ల‌కు క‌రోనా సోకిన కార‌ణంగా మొద‌ట ముంబై-ఆర్‌సీబీ మ‌ధ్య ప్రారంభ మ్యాచ్ నిర్వ‌హించాల‌ని బీసీసీఐ భావించింది. కానీ సీఎస్‌కే ఆట‌గాళ్లు కోలుకున్న కార‌ణంగా ముంబై-సీఎఎస్‌కే మ‌ధ్య మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌కు లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ షెడ్యూల్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు బీసీసీఐ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo