లండన్: భారత హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకింది. కొవిడ్ పరీక్షల్లో అతడికి పాజిటివ్ అని తేలినట్లు బీసీసీఐ ఆదివారం వెల్లడించింది. దీంతో శాస్త్రితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న బౌలింగ్ కోచ్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఐసొలేషన్‌లోకి వెళ్లారు.