ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Sep 04, 2020 , 00:16:57

బీసీసీఐ వైద్య బృందానికి కరోనా సెగ

బీసీసీఐ వైద్య బృందానికి కరోనా సెగ

దుబాయ్‌: బీసీసీఐ వైద్య బృందానికి కరోనా సెగ తాకింది. ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చెందిన 13 కరోనావైరస్‌ బారిన పడగా.. తాజాగా బీసీసీఐ మెడికల్‌ టీమ్‌లోని ఓ వైద్యుడికి పాజిటివ్‌ వచ్చినట్లు గురువారం బీసీసీఐ అధికారి వెల్లడించారు. ‘దుబాయ్‌లో ఉన్న బీసీసీఐ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌కు కరోనా సోకింది. అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఎలాంటి ఇబ్బంది లేదు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో కూడా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది’ అని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు.


logo