మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 14, 2020 , 18:39:36

కరోనా ఎఫెక్ట్‌.. అన్ని దేశవాళీ టోర్నీలు రద్దు చేసిన బీసీసీఐ

కరోనా ఎఫెక్ట్‌.. అన్ని దేశవాళీ టోర్నీలు రద్దు చేసిన బీసీసీఐ

ముంబయి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘కరోనా’ మహమ్మారి కారణంగా బీసీసీఐ(బోర్డు కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా) ఆధ్వర్యంలో జరిగే దేశవాళీ టోర్నీలన్నీ రద్దయ్యాయి. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందే ఇండియా, దక్షిణాఫ్రికా తలపడనున్న మూడు వన్డేల సిరీస్‌ను రద్దు చేసిన బీసీసీఐ.. ఈ నెల చివరి వారంలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది. రద్దయిన టోర్నీల్లో పేటీఎం ఇరానీ కప్‌, మహిళల వన్డే నాకౌట్‌, విజ్జీ ట్రోఫీ, మహిళల అండర్‌-19 టీ-20 లీగ్‌ లు ఉన్నాయి.  టోర్నీలు ఎప్పుడు పున ప్రారంభయ్యేది త్వరలోనే వెల్లడించనున్నట్లు బోర్డు తెలిపింది.


logo
>>>>>>