లండన్: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ప్రారంభమైన మొదటి టెస్టులో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ అరంగేట్రం బ్యాట్స్‌మన్ డేవాన్ కాన్వె(136 నాటౌట్) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి కివీస్ 246 పరుగులు చేసింది. క్రీజులో కాన్వెతో పాటు హెన్రీ నికోల్స్ (46) ఉన్నాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్(13), రాస్ టేలర్(14) విఫలమైన చోట కాన్వె సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. లార్డ్స్ మైదానంలో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆరో బ్యాట్స్‌మన్‌గా కాన్వె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.