గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 22, 2021 , 16:43:37

కాన్‌వే 99 నాటౌట్‌.. తొలి టీ20 కివీస్ వ‌శం

కాన్‌వే 99 నాటౌట్‌.. తొలి టీ20 కివీస్ వ‌శం

క్రైస్ట్‌చ‌ర్చ్: ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జ‌ట్టు 53 ర‌న్స్ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. కివీస్ బ్యాట్స్‌మెన్ దేవన్ కాన్‌వే 59 బంతుల్లో 99 ప‌రుగులు చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు.  ఆర‌వ టీ20 మ్యాచ్ ఆడుతున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ కాన్‌వే సూప‌ర్ ఆట తీరును ప్ర‌ద‌ర్శించాడు. ఓ ద‌శ‌లో 19 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన్ కివీస్‌కు భారీ స్కోర్‌ను అందించాడ‌త‌ను. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో న్యూజిలాండ్ అయిదు వికెట్ల న‌ష్టానికి 184 ర‌న్స్ చేసింది.  ఆ త‌ర్వాత చేజింగ్ మొద‌లుపెట్టిన ఆసీస్‌కు కివీస్ బౌల‌ర్లు జ‌ల‌క్ ఇచ్చారు.  టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌లు తొలి 5 ఓవ‌ర్ల‌లోనే నాలుగు వికెట్లు తీశారు.  ఓ ద‌శ‌లో 19 ప‌రుగుల‌కే ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. అయితే మ‌రో 2.3  ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే ఆస్ట్రేలియా 131 ర‌న్స్‌కు ఆలౌటైంది. లెగ్ స్పిన్న‌ర్ ఐస్ సోథి 4 వికెట్లు తీసుకున్నాడు.  5 మ్యాచ్‌ల సిరీస్‌లో గురువారం రెండ‌వ టీ20 జ‌ర‌గ‌నున్న‌ది.  దేవ‌న్ కాన్‌వే పుట్టింది ద‌క్షిణాఫ్రికాలో. కానీ అత‌ను ఆడుతోంది న్యూజిలాండ్‌కు.  టీ20ల్లో అత‌ను స‌గ‌టు 91గా ఉంది. గ‌త మూడు ఇన్నింగ్స్‌లో 69 నాటౌట్‌, 91 నాటౌట్‌, 93 నాటౌట్‌గా నిలిచాడు.  

VIDEOS

logo