ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 28, 2020 , 17:42:51

'కొత్త ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు..' విరుష్కకు రోహిత్‌ విషెస్‌

'కొత్త ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు..' విరుష్కకు రోహిత్‌ విషెస్‌

అనుష్క శర్మ గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా విరాట్‌ కోహ్లి గురువారం ప్రకటించాడు. దీంతో కోహి, అనుష్క శర్మలకు ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు.  ‘ఇద్దరికీ శుభాకాంక్షలు.. మీ కొత్త ఇన్నింగ్స్‌కు బెస్ట్‌ విషెస్‌’ అని రోహిత్‌ కోహ్లి ట్వీట్‌కు కామెంట్‌ చేశాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో ఏకంగా ఐదు శతకాలు బాదిన రోహిత్ శర్మ.. ఒంటిచేత్తో టీమిండియాని సెమీ ఫైనల్‌కి చేర్చాడు. కానీ న్యూజిలాండ్‌తో జరిగిన ఆ సెమీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు భారత్ ఓటమికి కారణమయ్యాయని.. రోహిత్ శర్మ టీమ్‌ కంటే ముందుగానే ఒంటరిగా ఇంగ్లాండ్ నుంచి భారత్‌కి చేరుకున్నాడు.

ఇదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శర్మని అనుష్క శర్మ అన్‌ఫాలో చేసింది. నిమిషాల వ్యవధిలోనే రోహిత్ శర్మ కూడా అనుష్కను అన్‌ఫాలో చేశాడు. దీంతో కోహ్లీ, రోహిత్ మధ్య దూరం మరింత పెరిగిందని అందరు భావించారు. తాజాగా అనుష్క శర్మను తన ట్వీట్‌లో ప్రస్తావించడం ద్వారా తమ మధ్య ఇప్పడు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని పూర్తిగా రోహిత్ శర్మ స్పష్టం చేసినట్లయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo