మంగళవారం 04 ఆగస్టు 2020
Sports - Jul 03, 2020 , 20:26:18

కోహ్లీతో వద్దు పాక్‌ క్రికెటర్లతో పోల్చండి : బాబర్‌ ఆజామ్‌

కోహ్లీతో వద్దు పాక్‌ క్రికెటర్లతో పోల్చండి : బాబర్‌ ఆజామ్‌

ముంబై : భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కాకుండా పాకిస్థాన్‌ ఆటగాళ్లతో తనను పోల్చాలని పాక్‌ క్రికెటర్‌ బాబర్‌ ఆజామ్‌ కోరాడు. అప్పుడే తాను సాధించిన ఘనతకు తగిన గుర్తింపు లభిస్తుందన్నాడు. క్రికెట్‌లో అద్భుతమైన షాట్లు కొట్టే ఆజామ్‌ను అభిమానులు ఎక్కువగా కోహ్లీతో పోలుస్తుంటారు. ఆజామ్‌ కూడా విరాట్‌లా ఆడాలి అని గతంలో ఎన్నో సార్లు చెప్పాడు. కానీ ఇప్పుడు ఎందుకో మరి కోహ్లీతో పోల్చవద్దు అంటున్నాడు.

టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో బాబర్‌ మాట్లాడుతూ ‘నన్ను ఎవరితో అయినా పోల్చాలనుకుంటే కోహ్లీతో కాకుండా పాకిస్థాన్‌ క్రికెటర్లతో పోలిస్తే సంతోషిస్తా, జావెద్‌ మియాందాద్‌, యూనిస్‌ఖాన్‌, ఇంజమాముల్‌ ఉల్‌ హఖ్‌ వంటి వారితో పోలిస్తే మరింత గర్వపడతా’ అని అన్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో ఆజామ్‌ మొదటిస్థానంలో ఉన్నాడు. వన్డేల్లో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo