గురువారం 09 జూలై 2020
Sports - Apr 16, 2020 , 17:34:39

అంచ‌నాల ఒత్తిడితో ఇబ్బందే: గాఫ్‌

అంచ‌నాల ఒత్తిడితో ఇబ్బందే:  గాఫ్‌

న్యూఢిల్లీ:  కెరీర్ ఆరంభంలో త‌న‌పై పెరిగిన విప‌రీత‌మైన హైప్‌తో ఇబ్బంది ప‌డ్డాన‌ని అమెరికా యువ టెన్నిస్ తార కోకో గాఫ్ చెప్పింది. ప్రొఫెష‌న‌ల్ స‌ర్క్యూట్‌లో అడుగుపెట్ట‌డంతోనే అద్భుతాలు సృష్టిస్తున్న ఈ ప‌ద‌హారేండ్ల చిన్నది.. గ‌తేడాది వింబుల్డ‌న్ టోర్నీలో నాలుగో రౌండ్‌కు చేరి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అది ఆమె పాల్గొన్న తొలి మేజ‌ర్ ఈవెంట్ కావ‌డం విశేషం. ఆ ప్ర‌ద‌ర్శ‌న గాలివాటం కాదంటూ నిల‌క‌డైన ఆట‌తీరుతో ఈ ఏడాది ఆరంభంలో జ‌రిగిన ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లోనూ నాలుగో రౌండ్‌కు చేరింది. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో టాప్ 50లో చోటు ద‌క్కించుకున్న అతి పిన్న వ‌య‌స్కురాలిగానూ ఆమె రికార్డు నెల‌కొల్పింది. 

`రికార్డులు నాకు కొత్త కాదు. నేను టెన్నిస్‌లో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి.. అతి చిన్న వ‌య‌సులో అనే రికార్డులు నా పేరిట చాలా ఉన్నాయి. దాని వ‌ల్లే నాపై అంచ‌నాల ఒత్తిడి పెరిగింది. అది నాకు ఏమాత్రం న‌చ్చ‌దు. గ‌తేడాది వింబుల్డ‌న్ నుంచి మీరంతా న‌న్ను చూస్తున్నారు. కానీ అంత‌కుముందు ఏడాది నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలా వ‌ద్దా అని తెగ మ‌ద‌న‌ప‌డ్డా. అందులో విజ‌య‌వంతం కాక‌పోతే ఎలా అనే సందేహాలు నన్ను ఉక్కిరిబిక్కిర చేసేవి. దాని వ‌ల్ల చాలాసార్లు ఏడిచాను కూడా. కానీ నేను అభిమానించి విలియ‌మ్స్ సిస్ట‌ర్స్‌లాగా ఎద‌గాల‌ని భావించి ముందుకు సాగా` అని గాఫ్ చెప్పింది.
logo