శనివారం 11 జూలై 2020
Sports - May 19, 2020 , 20:40:15

నమ్మకమే ప్రధానం: బంగర్‌

నమ్మకమే ప్రధానం: బంగర్‌

న్యూఢిల్లీ: ఆటగాళ్లకు కోచ్‌కు మధ్య బంధం బలంగా ఉండాలంటే నమ్మకం ప్రధానాంశమని టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ వ్యాఖ్యానించాడు. కోచ్‌పై నమ్మకముంచితేనే తమలోని అభద్రతాభావాలను చర్చించేందుకు ప్లేయర్లు ముందుకొస్తారని బంగర్‌ పేర్కొన్నాడు. మంగళవారం ‘క్రికెట్‌ కనెక్టెడ్‌’ కార్యక్రమంలో సంజయ్‌ మాట్లాడుతూ.. ‘నమ్మకమే అన్నింటి కంటే ప్రధానమని నా ఉద్దేశం. శారీరక శిక్షకుడైనా, మానసిక శిక్షకుడైనా ముందు ఆటగాళ్లు అతడిని నమ్మాలి. తమ సమస్యలు చెప్పుకుంటే లాభం జరుగుతుందనుకుంటే ఆ బంధం బలంగా ఉంటుంది. అయితే వారిద్దరి మధ్య జరిగిన చర్చ మూడో వ్యక్తికి తెలియకుండా ఉంటుందనే నమ్మకం ప్లేయర్లలో వచ్చినప్పుడు ఆ కోచ్‌ మనగల్గుతాడు’ అని అన్నాడు.

 2014 నుంచి 2019 వరకు సంజయ్‌ బంగర్‌ భారత జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో కోహ్లీ సేన ఓటమి పాలవడంతో అతడిపై వేటు పడింది. ప్రస్తుతం అతడి స్థానంలో విక్రమ్‌ రాథోడ్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 


logo