ఆదివారం 07 జూన్ 2020
Sports - Apr 01, 2020 , 20:58:09

ష‌ట్ల‌ర్లను `జూమ్‌` చేయ‌నున్న గోపీచంద్‌

ష‌ట్ల‌ర్లను `జూమ్‌` చేయ‌నున్న గోపీచంద్‌

హైద‌రాబాద్‌: బ‌్యాడ్మింట‌న్ క్రీడాకారుల ప్రాక్టీస్‌ను ఆన్‌లైన్ ద్వారా ప‌ర్య‌వేక్షించేందుకు `జూమ్‌`అప్లికేష‌న్ వినియోగించ‌నున్న‌ట్లు జాతీయ బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపాడు. క‌రోనా కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన ష‌ట్ల‌ర్లు స‌రైన విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనే అంశాన్ని ఇంటి వ‌ద్ద నుండే ప‌ర్య‌వేక్షించ‌నున్నాడు. ప్ర‌ముఖ ఫిట్‌నెస్ శిక్ష‌కుడు దినాజ్ వార్వ‌ట్‌వాలాతో క‌లిసి ష‌ట్ల‌ర్ల‌కు ఆన్‌లైన్‌లోనే వ్యాయామ శిక్ష‌ణ ఇవ్వ‌నున్నాడు. లాక్‌డౌన్ కార‌ణంగా ఆట‌గాళ్లంతా వేర్వేరు చోట్ల ఉన్న‌ప్ప‌టికీ ఈ అప్లికేష‌న్ ద్వారా అందిరిని స‌మ‌న్వ‌య‌ప‌రుస్తున్నామ‌ని గోపీచంద్ పేర్కొన్నాడు. 

`ఫిట్‌గా ఉండే మార్గాల‌ను మ‌న‌మే ఎంచుకోవాలి. లాక్‌డౌన్ ముగిసే స‌రికి ఆట‌గాళ్లంతా మ్యాచ్ ఫిట్‌నెస్‌తో బ్యాడ్మింట‌న్ కోర్టులో అడుగుపెట్టాలి. `జూమ్‌` అప్లికేష‌న్ ద్వారా రోజు రెండు సెష‌న్లు నిర్వ‌హిస్తాం. నాతో పాటు దినాజ్ ఆట‌గాళ్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తూ వ్యాయామ ప‌ద్ధ‌తులు వివ‌రిస్తారు. ఇందులో మెడిటేష‌న్‌,  స్కిప్పింగ్ సూర్య‌న‌మ‌స్కారాల‌తో పాటు శాస్త్రీయ ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తాం` అని గోపీచంద్ చెప్పుకొచ్చాడు.


logo