మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 12, 2020 , 00:00:21

నేటి నుంచి సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నీ

నేటి నుంచి సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నీ

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఈనెల 17న సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం నుంచి వారం రోజుల పాటు నగరంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో క్రికెట్‌ టోర్నీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ విలేకర్లకు తెలిపారు. టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలోని జట్ల నడుమ ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. యువతను ప్రోత్సహించి వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నీలు దోహదపడుతాయని అన్నారు. 


అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచారని పేర్కొన్నారు. అలాంటి  నాయకుని జన్మదినం సందర్భంగా క్రికెట్‌ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పోటీలను విజయవంతం చేయడంతో పాటు ఈనెల 17న ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటి సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపాలన్నారు. ఈ సమావేశంలో కుడా చైర్మన్‌ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్‌ రమేశ్‌, జిల్లా క్రికెట్‌ సంఘం ప్రధాన కార్యదర్శి ఉదయ్‌భాను రావు, కుమార్‌, సదానందం పలువురు పాల్గొన్నారు. 


logo
>>>>>>