శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 07, 2020 , 02:29:30

నేటి నుంచి క్లబ్‌ ఫైట్స్‌ బాక్సింగ్‌ టోర్నీ

 నేటి నుంచి క్లబ్‌ ఫైట్స్‌ బాక్సింగ్‌ టోర్నీ

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి:  హైదరాబాద్‌ వేదికగా శనివారం క్లబ్‌ ఫైట్స్‌ టోర్నీ మొదలుకాబోతున్నది. 15 వారాల పాటు జరుగనున్న చాంపియన్‌షిప్‌లో యువ బాక్సర్లు తమ పంచ్‌ పవర్‌ ఏంటో రుచి చూపించనున్నారు. ఎవోలెట్‌ మోటా ర్స్‌ సహకారంతో రెడ్‌ కార్నర్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్స్‌ ఆధ్వర్యంలో జరుగబోతున్న టోర్నీ కోసం శుక్రవారం ఎల్బీ స్టేడియంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ కైలాశ్‌నాథ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరుగబోతున్న క్లబ్‌ ఫైట్స్‌ టోర్నీ దేశంలోనే మొదటిదని అన్నారు. ఇలాంటి టోర్నీల ద్వారా రాష్ట్రంలో యువ బాక్సర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారముంటుందని  పేర్కొన్నారు.