ఆదివారం 05 జూలై 2020
Sports - May 09, 2020 , 16:09:50

ఖాళీ మైద‌నాల్లో నిర్వ‌హించాలి: ఖ‌వాజా

ఖాళీ మైద‌నాల్లో నిర్వ‌హించాలి: ఖ‌వాజా

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది చివ‌ర్లో జ‌ర‌గాల్సి ఉన్న టీమ్ఇండియా ప‌ర్య‌ట‌న‌పై ఆస్ట్రేలియా జ‌ట్టు చాలా ఆశ‌లు పెట్టుకుంది. షెడ్యూల్ ప్ర‌కారం పొట్టి ప్ర‌పంచ‌వ‌క‌ప్ త‌ర్వాత జ‌ర‌గాల్సి ఉన్న ఈ సిరీస్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నిర్వ‌హించాల‌నే ప‌ట్టుద‌ల‌తో క‌నిపిస్తున్న‌ది. ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌కుండా ఖాళీ మైదాన‌ల్లో మ్యాచ్‌లు నిర్వ‌హించ‌డమే మేల‌ని ఆసీస్ ఆట‌గాడు ఉస్మాన్ ఖ‌వాజా అభిప్రాయ‌ప‌డ్డాడు. అలా అయితే టీవీల ద్వారా అయినా ప్రేక్ష‌కుల‌కు మ్యాచ్‌లు చూసే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని అన్నాడు. 

`గ‌త ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ముఖ్యంగా చ‌తేశ్వ‌ర్ పుజారా అద‌ర‌గొట్టాడు. కోహ్లీ జ‌ట్టును న‌డిపించిన తీరు కూడా అమోఘం` అని ఉస్మాన్ ఖ‌వాజా గుర్తు చేసుకున్నాడు. ఈ సారి ఆసీస్ జ‌ట్టు బ‌లంగా ఉంద‌ని.. ఇరు జ‌ట్ల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు ఖ‌యామే అని అత‌డు పేర్కొన్నాడు. logo