గురువారం 29 అక్టోబర్ 2020
Sports - Sep 26, 2020 , 16:42:21

KKRvSRH: తొలి విజయం ఎవరిదో..!

KKRvSRH: తొలి విజయం ఎవరిదో..!

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌లో శనివారం మరో ఆసక్తికర పోరు జరగనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌,  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు అబుదాబి వేదికగా తలపడనున్నాయి. రెండు జట్లూ కూడా  టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమిని ఎదుర్కొన్నాయి.  

మిడిలార్డర్‌ వైఫల్యంతో బెంగళూరు చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌  జట్టు.. శనివారం కోల్‌కతాపై నెగ్గి లీగ్‌లో బోణీ చేయాలని భావిస్తున్నది.  తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు రనౌటైన కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు.  గాయం కారణంగా లీగ్‌కు దూరమైన ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ స్థానంలో జాసెన్‌ హోల్డర్‌ లేదా మహ్మద్‌ నబీ జట్టులోకి రావొచ్చు. 

మిడిలార్డర్‌లో మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌, ప్రియం గార్గ్‌ మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది.  తొలి మ్యాచ్‌ తప్పిదాలను సరిదిద్దుకొని రెండో పోరుకు   హైదరాబాద్‌ సన్నద్ధమైంది.   ముంబై చేతిలో ఓడిన కోల్‌కతా ఈ మ్యాచ్‌  నెగ్గి పాయింట్ల పట్టికలో ఖాతా తెరువాలని  పట్టుదలతో ఉన్నది. భారీ హిట్టింగ్‌ చేసే ఆండ్రూ  రస్సెల్‌తో  పాటు ఇయాన్‌ మోర్గాన్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో  ముందు పంపితే కోల్‌కతా మెరుగైన ఫలితాలను సాధించొచ్చు.


logo